Logo
Date of Publish : 13 July 2021, 6:44 am
Editor : Sake Naresh

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు : జనసేన నాయకులు కందుల దుర్గేష్

             జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శ్రీ కందుల దుర్గేష్ గారిని రాజమహేంద్రవరం అర్బన్ జనసేన నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుర్గేష్ గారు మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోవు రాజమహేంద్రవరం అర్బన్ కార్పొరేషన్ ఎలక్షన్ లో జనసేన పార్టీ నీ అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ శ్రమించాలని పార్టీ బలోపేతానికి త్వరలోనే కొత్త కమిటీని ఏర్పాటు చేస్తాను అన్నారు. అలాగే ఈ పదవిని ఇచ్చిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర నాయకులు PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేశారు. ఇప్పటి వరకూ కమీటీలు వేయలేదని విమర్శించిన వారికి జనసేన పార్టీ అధ్యక్షులు కమీటీలని నియమించి వారికి చెంపపెట్టులాగా సమాధానం ఇచ్చారన్నారు. త్వరలోనే మండల, గ్రామ స్థాయిలో కమీటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ సిద్దాంతాలను, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెడ్డం నాగరాజు, గుత్తుల బుల్లి, చైతన్య కుమార్, బాసరబోయిన దుర్గ ప్రసాద్, ఆటో రాజు, MSR రాజు, ప్రసాద్, శ్రీను, ధర్మ రాజు, వెంకటేష్, రాంబాబు తదితరలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com