Logo
Date of Publish : 28 February 2022, 1:50 am
Editor : Sake Naresh

బెజవాడలో కేబుల్ మాఫీయా – విజయవాడ నగర జనసేనపార్టీ అధ్యక్షులు పోతిన మహేష్

     విజయవాడ, (జనస్వరం) : బెజవాడలో కేబుల్ మాఫీయా చెలరేగుతోందని విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్ అన్నారు. ఆదివారం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేబుల్ రంగంలో కొంతమంది మాఫియాగా ఏర్పడి కేబుల్ రంగాన్ని నియంత్రిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని, మాటవినని కేబుల్ ఆపరేటర్లను మానసికంగానూ వేధిస్తూ కేబుల్ వైర్ లను కట్ చేస్తున్నారని, వైర్లు కట్ అయితే వాటిని జాయింట్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని, మళ్లీ‌ బాధితుల మీదే ఎదురు పోలీస్ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అధికార పార్టీ కార్పొరేటర్ భర్త పెదబాబు ఆవేదనతో అధికార పార్టీ నేతల ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పెదబాబు విడుదల చేసిన వీడియోనే ఇందుకు సాక్ష్యం మనీ, ఒక కార్పొరేటర్ భర్తకే వేధింపులు ఉంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటోనని, ఇష్టానుసారంగా నెట్వర్క్ మార్చుకుంటూ ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని, ప్రతిసారి సెటప్ బాక్స్ లు మార్చాలని ఒత్తిడి చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీను అండదండలతో కేబుల్ ఆపరేటర్ వేధిస్తున్నారని అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అండతోనే కేబుల్ మాఫియా రెచ్చిపోతుందని , స్థానిక నాయకులు అండదండలతోనే ఈ వేధింపులు ఉన్నాయని కార్పొరేటర్ భర్త చెప్పారని, అంటే ఈ కేబుల్ మాఫీ వెనక వెల్లంపల్లి శ్రీను ఉన్నారని అర్థమవుతుందని అన్నారు. కేబుల్ మాఫియా ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ప్రచారం జరుగుతోందన్నారు. తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఘటనపై మంత్రి స్పందించాలని, రెండు దశాబ్దాలుగా కేబుల్ రంగంపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు కొత్తగా ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నారని, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ వారు పోల్ టాక్స్ లు ఎవరెవరు కడుతున్నారో అధికారులు దృష్టి సారించాలన్నారు. నష్టాల్లో ఉన్న కార్పొరేషన్ కు ఆదాయాన్నిచ్చే మార్గాల్లో కేబుల్ కూడా ఒకటి అని , పార్టీలతో సంబంధం లేకుండా అన్ని కేబుల్ సంస్థల నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పన్ను చెల్లించని ఆపరేటర్ల కేబుల్ వైర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. పెదబాబుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని మీరు ఎటువంటి పోరాటం చేసిన దానికి ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ఇస్తామని, బెదిరింపులపై పోలీసులు శాఖ వారు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com