అవనిగడ్డ ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అక్రమ బుసక తవ్వకాలపై జనసేన పార్టీ పోరుబాట పట్టింది. సి.ఆర్.జెడ్. పరిధి, నదీ పరివాహక చట్టం, వాల్టా చట్టాలను ఉల్లంఘనలకు పాల్పడుతూ స్థానిక అధికార పార్టీ నేతల అండతో కృష్ణా నదీలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. మోపిదేవి మండలం ఉత్తర చిరువోల్లంక వద్ద సాగుతున్న అక్రమ బుసక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని పలు సందర్భాల్లో జనసేన నాయకులు అధికారులకు విన్నవించారు. మైనింగ్ మాఫియా రాత్రిళ్లు యంత్రాలు పెట్టి మరీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ బుసక తవ్వేస్తున్నారు. విషయం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ నాయకులు శనివారం తవ్వకాలు సాగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై దోచుకుంటున్నారని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆరోపించారు. సంబంధిత అధికారులు అక్రమ తవ్వకాలపై తక్షణం చర్యలు తీసుకోని పక్షంలో హైకోర్టులో రిట్ దాఖలు చేసి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలకు కొమ్ముకాసే అధికారులను విడిచిపెట్టేది లేదని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లీగల్ సెల్ నాయకులు బాసు నాంచారయ్య నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, పార్ట నాయకులు బచ్చు వెంకటనాథ్, పూషడపు రత్నగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com