Logo
Date of Publish : 16 July 2026, 7:35 pm
Editor : Sake Naresh

జాప్ జిల్లా అధ్యక్షుడిగా సి.పి. వేణుగోపాల్ రెడ్డి నియామకం

అనంతపురం, జూలై 6 (జనస్వరం): జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్యూరో ప్రతినిధి సి.పి. వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు జాప్ రాష్ట్ర అధ్యక్షుడు పున్నంరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సి.పి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పాత్రికేయులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అక్రిడిటేషన్, సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, గృహ స్థలాలు, వృత్తి భద్రత వంటి అంశాలను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. యువ పాత్రికేయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంస్థను జిల్లాలో మరింత విస్తరించే దిశగా కార్యాచరణ చేపడతానన్నారు. ఆయన నియామకం పట్ల జిల్లాలోని పలువురు సీనియర్ జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com