Logo
Date of Publish : 02 April 2022, 11:05 am
Editor : Sake Naresh

విజయవాడ 47వ డివిజన్లో మజ్జిగ పంపిణీ

విజయవాడ 47వ డివిజన్లో మజ్జిగ పంపిణీ
విజయవాడ, (జనస్వరం) : స్థానిక పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వెంపల్లి. గౌరీశంకర్ అధ్వర్యంలో శనివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు, జనసైనికులు నిరసన తెలియజేస్తూన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఎవరు ఎటువంటి అవాంతరాలు సృష్టించిన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. డివిజన్లోని ప్రతి ఒక్కరికి తాము అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సంయుక్త కార్యదర్శులు పడాల రాంబాబు, గొకాడ ఉమాశంకర్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెవుల శ్రీనివాస్ బాబు, పొట్నూరి శివశంకర్, బంటుమిల్లి రాంబాబు, మలమంటి ఆంజనేయులు, అప్పారావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com