
ఒంగోలు ( జనస్వరం ) : 12వ డివిజన్ అధ్యక్షులు కటకంశెట్టి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 71వ రోజు ఒంగోలులోని 12వ డివిజన్ మస్తాన్ దర్గ, ఫకీర్ పాలెం లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు మాట్లాడుతూ ఇప్పటిదాకా అందరికీ అవకాశం ఇచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ఇస్తామని అన్నారు. ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ రాష్ట్రాన్ని, మరియు మమ్మల్ని ఈ జగన్ రెడ్డి పెట్టే కష్టాలు నుండి కాపాడేది ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నాయకులతో అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆర్ కె నాయుడు ముత్యాల,పల్ల ప్రమీల,ఒంగోలు నగర జనసేన కార్యదర్శి గోవింద్ కోమలి,వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు సుధాకర్ పసుపులేటి, మహేష్ జగతపి, సాయి, జనసేవ శ్రీనివాస్, ఉంగరాల వాసు, అవినాష్ నాయడు పర్చూరి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.