Search
Close this search box.
Search
Close this search box.

సీఎం జగన్ పాలనలో వ్యాపారాలు పూర్తిగా మందగించాయి : పోతిన మహేష్

సీఎం జగన్

       విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo 22 వ రోజు కార్యక్రమం 37వ డివిజన్ అధ్యక్షులు శిగినం శెట్టి రాము గుప్త గారి ఆధ్వర్యంలో సామ్రంగ్ చౌక్ వద్దనుండి ప్రారంభించి 37డివిజన్ లోని పూల బావి సందు పరిసర ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.పోతిన మహేష్ గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 37వ డివిజన్లోని సామ్రంగ్ చౌక్ వద్ద నుండి ప్రారంభించి పూలబావి పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని స్థానికులు,వ్యాపారస్తులు మీరు వ్యాపారస్తులకి అండగా నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మమ్మల్ని విరాళాలు ఇవ్వాలని, ప్రతి కార్యక్రమానికి కూడా ఏదో రూపంలో డబ్బులు ఇవ్వాలని మమ్మల్ని ఒత్తిడి చేసేవారని, ఇటువంటి వ్యక్తికి రాబోయే రోజుల్లో మా మద్దతు ఉండదని ప్రతి కార్యక్రమానికి వ్యాపారస్తులును పీడించి డబ్బులు వసూలు చేసేటువంటి దుర్మార్గుడు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అని మాకు కష్టం వస్తే పిలవగానే వచ్చి మాకు అండగా నిలబడే వ్యక్తి మీరని రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి,పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వ్యాపారస్తులు మీద ఒత్తిడి లేకుండా ఉండాలన్న పోతిన మహేష్ గారి లాంటి వ్యక్తి మాకు నాయకులుగా ఉండాలని స్థానికులు చెప్పడం జరిగిందని మూడు సింహాలు దొంగలించినటువంటి దొంగ ఎవరో అందరికీ తెలుసని, కొత్త గుళ్ళకి చెందినటువంటి 350 కోట్ల రూపాయల ఆస్తులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కొట్టేయాలని చూస్తే మేమే పోరాటం చేసి ఆపామని, స్థానికులు గతంలో మా పెద్దలు దేవాలయాలు బాగుండాలని పెద్ద ఎత్తున భూములు ఇస్తే వాటిని వెల్లంపల్లి శ్రీనివాసరావు కొట్టేయాలని చూస్తున్నారాని, అటువంటి వ్యక్తకి సపోర్ట్ చేయమని, ఓడిపోయినప్పటికీ నిస్వార్ధంగా గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పోతిన మహేష్ కె సంపూర్ణ మద్దతు ఉంటుందని స్థానికులు చెప్పడం జరిగిందని, నిన్న వాసవి మాత ఊరేగింపులో కూడా రాజకీయం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, వాసవి మాత కార్యక్రమం సందర్భంగా నిన్న నదీ విహారాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి అనుమతులు రాకుండా అడ్డుకుని ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించినటువంటి దుర్మార్గపు వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావని, దేవుళ్లును కూడా రాజకీయం చేస్తున్నారని ,దేవుళ్ళ విషయంలో కూడా ఇటువంటి రాజకీయాలు చేస్తే నీపతనం మరింత తీవ్రంగా ఉంటుందని మహేష్ హెచ్చరించారు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాపారస్తులకి అండగా నిలబడతారని వారి సమస్యలును పరిష్కరిస్తారని, వారికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని గతంలో తెలియజేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు గుంటూరు లోని వాసవి మాత ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సమజం తో కలిసి చర్చించి వారి యొక్క కష్టాలు,ఇబ్బందులు తెలుసుకున్నారు.
                శిగినం శెట్టి రాము గుప్త గారు మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు 37వ డివిజన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ ఆధ్వర్యంలో పూలబావి సందు పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని ఇంటింటికి వెళ్తుంటే ఆర్యవైశ్యులు గాని మార్వాడి సోదరులు ఒకటే చెబుతున్నారని పేద మధ్యతరగతి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదని ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా యొక్క వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడే ఉంటున్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గాని, స్థానిక కార్పొరేటర్ చటర్జీ గాని మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని వారు మాకుఅసలు అందుబాటులోనే ఉండటం లేదని ఎన్నికల సమయంలో లేదా ఏదైనా విరాళాల అవసరం అయితే మేము గుర్తొస్తున్నామని మిగతా సమయంలో గుర్తుకు రావటం లేదని అదేవిధంగా భవానిపురంలోని ఆర్యవైశ్యులు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యాక మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని అదేవిధంగా స్థానిక ఆర్యవైశ్యులు గాని మార్వాడిలు గాని వెల్లంపల్లి శ్రీనివాస్ రావు గాని జగన్ మోహన్ రెడ్డి గారికి గాని మా మద్దతు ఉండదని రానున్న రోజుల్లో జనసేన ప్రభుత్వానికికే మా సంపూర్ణ మద్దతు అని ఈసందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుల రవిశంకర్, ,కొరగంజి వెంకటరమణ, తిరుపతి సురేష్, బోమ్ము రాంబాబు, వెన్న శివశంకర్ , స్టాలిన్ శంకర్, బోట్టా సాయి,రజిని,పుల్ల రావు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way