
ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి వాలంటీర్ వ్యవస్థని కించపరచలేదని వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారని అన్నారు. వైసీపీ నాయకులు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కుటుంబ డేటాను తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని మాత్రమే పవన్ కళ్యాణ్ తెలియజేశారని అన్నారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మహిళలకు మద్దతుగా మాట్లాడారని అలాగే ప్రతి వ్యవస్థలోను తప్పులు ఉంటాయని అలాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా తప్పులు ఉన్నాయని తెలియజేసినందుకు ఇలా ర్యాలీలు, పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు హేయమైన చర్యని తీవ్రంగా ఖండించారు.