
రాయచోటి ( జనస్వరం ) : పట్టణ౦లో జగనన్న కాలనిలో 3వ రోజు సోషల్ ఆడిట్ పర్యటన లో భాగంగా… రాయచోటి అసెంబ్లీ ఇంఛార్జ్ షేక్ హసన్ భాష ఆధ్వర్యంలో సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పేరుకు మాత్రమే జగనన్న కాలనీ అక్కడ చూస్తే ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవన్నారు. రోడ్లు విద్యుత్, నీరు, ఇంటర్నెట్, బస్సు, సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. కాలనీ పేరు అడ్డపెట్టుకుని ఇసుకను డంపింగ్ చేసుకుని సాధారణ ప్రజలకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాటల్లో గొప్పలు, చేతలు మాత్రం శూన్యం జగనన్న కాలనీ పేరు ముందర పెట్టుకుని ఆర్చులు, రంగులు, ప్రకటనల్లో ఉన్న ధ్యాస కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించడంలో లేదన్నారు. అదేవిధంగా నిజమైన లబ్ధిదారులకు అక్కడ ఎటువంటి న్యాయం జరగడం లేదని, వేలాది ఎకరాల వేల కోట్ల విలువైన భూములను దిగమింగి కొండలకు గుట్టలల్లో సాధారణ ప్రజలకు ఇళ్ళ స్థలాలను కేటాయిస్తున్నారు అని ఆవేదన వ్యక్తంచేశారు. జనసేన జిల్లా దూదేకుల సంగం అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ జగన్ గారికి బెంగుళూరులో 29 ఎకరాల్లో 3 లక్షల పదివేల చదరపు అడుగులలో ఒక రాజ భవనాన్ని, హైదరాబాద్ లో నవాబులకు దీటుగా మహల్ ను, పులివెందుల లో ప్యాలెస్, ఇడుపులపాయలో ఎస్టేట్, అమరావతిలో ఇంద్ర భవనం నిర్మించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు ఒకటింనర్ర సెంట్ భూమిలో ఒక లక్ష ఎనభైవేల డబ్బుతో ఇంటిని నిర్మాణం చేసుకోవాలన్నారు. ఇన్ని భవనాలు నిర్మించుకున్న జగనన్నకు ఈ డబ్బుతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా ఈ మాత్రం తెలియదా ముఖ్యమంత్రి గారికి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రియాజ్, జయరామ్, జనసైనికులు, ముసిర్, అహ్మద్, ఖాసిమ్, సల్మాన్, హాబీబ్, లక్షమమ్మ, రాజమ్మ, శివ, పరమేస్ తదితరులు పాల్గొన్నారు.