Search
Close this search box.
Search
Close this search box.

బడ్జెట్ కేటాయింపులపై లోతైన చర్చ జరగాలి – జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

       అమరావతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విశ్లేషించారు. డాంబికాలు, ప్రచార ఆర్భాటాలకు బడ్జెట్ ను ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పదే పదే గొప్పలు చెప్పుకున్న నాయకులు… ఏ వర్గానికి కూడా న్యాయం చేసింది లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… “  తమిళ మహాకవి తిరువల్లువార్ కవిత్వాన్ని ఉటంకిస్తూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆర్ధిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.  గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపథం మరియు న్యాయం మార్గాల నుంచి వైదొలగరు. ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు…. అంటూ ప్రసంగించారు. బుగ్గన గారి మాటల్లో ముఖ్యమంత్రి గారిని పొగిడారో.. రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదులే అని ఆయన క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారో అర్ధం కాలేదు. అయ్యా మంత్రి గారూ…. సీఎం గారి అహంకారంతో రాష్ట్ర ప్రజలు నలిగి పోతున్నారు. తమిళ కవి సూక్తుల బదులు వేమన సూక్తి అయిన  అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను… సజ్జనుండు పలుకు చల్లగాను అని చెప్పి ఉంటే ఆయనకు కరెక్టుగా సరిపోయేది.

● కేటాయించడం … సవరించడం తప్ప ఖర్చు పెట్టింది లేదు  

ప్రభుత్వ తీరుతో క్షేత్ర స్థాయిలో సామాన్యుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికే జనసేన పార్టీ రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయినింగ్ చేసింది. గత ఆర్ధిక సంవత్సరం రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం బడ్జెట్ లో రూ. 7500 కోట్లు కేటాయించారు. దానిని సవరించి రూ. 5 వేల కోట్లకు తగ్గించారు. చివరికి మరమ్మతుల కోసం ఎంత విడుదల చేశారో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గోతులు పడ్డ రోడ్లే దర్శనమిచ్చాయి. జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయినింగ్ తో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి గారు హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రూ. 2 వేల కోట్లు రోడ్ల మరమ్మతుల కోసం విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రోడ్ల మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేస్తామని గత ఏడాది నవంబర్ లో చెప్పారు. తరువాత తుపాన్లు వచ్చాయని, వర్షాలు పడుతున్నాయని  పనులు నెలల తరబడి వాయిదా వేసుకుంటూ వెళ్లారు. గత ఏడాది రూ. 2 వేల కోట్లే ఖర్చు చేయని మీరు ఇప్పుడు రూ. 8500 కోట్లు ఖర్చు చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారు.

● సాయం పొందే మత్స్యకారుల్లో ఇంత కోతా?  

97 వేల మంది మత్స్యకారులకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని ఆర్ధిక మంత్రి గారు గొప్పగా చెప్పుకున్నారు. సముద్రం మీదకు వేటకు వెళ్లే మత్స్యకారులు దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉంటే కేవలం 97 వేల మందికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులు, వారి స్థితిగతులు చూస్తే వాళ్లు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు  మీకు అర్ధమవుతాయి. పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమతో కలిపి మత్స్యకార శాఖకు రూ. 1568 కోట్లు మాత్రమే కేటాయించారు.  గత ఏడాది కేటాయింపులతో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే పెంచారు.  ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ కోణం నుంచి చూసినా నిరుపయోగమే. 

● ఏ ప్రాతిపదికన తెలంగాణతో పోల్చుకోగలం 

ప్రతి ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్షా 61 వేల కోట్లు. మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 2 లక్షల 56 వేల కోట్లు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా రూ. 2 లక్షల 56 వేల కోట్లు. ఏ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంతో మనం పోల్చుకోగలుగుతాం. జనాభా, విస్తీర్ణం పరంగా మన రాష్ట్రం పెద్దది. మనకున్నన్ని సహజ వనరులు ఆ రాష్ట్రానికి లేవు. ఇన్ని అంశాల్లో ఇంత తేడా ఉంటే వాళ్ల బడ్జెట్, మన బడ్జెట్ మాత్రం ఒక్కటే. దీనిపై మనందరం లోతుగా చర్చించాలి.

● ఇలా అయితే పెట్టుబడులు ఎలా వస్తాయి    

పరిశ్రమల శాఖకు బడ్జెట్ కేటాయించడం…. రెండు, మూడు నెలలలో సవరించడం. ఇలా చేసే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు.  ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు గత ఏడాది రూ. 1133 కోట్లు కేటాయించారు. చివరకు సవరించి రూ. 331 కోట్లకు తీసుకొచ్చారు. అదేవిధంగా పరిశ్రమల శాఖకు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 2540 కోట్లు కేటాయించారు. మన ప్రాంతానికి అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉపాధి దొరుకుంతుందని చెప్పారు. చివరకు ఆ బడ్జెట్ కేటాయింపులను సవరించి రూ. 1906 కోట్లకు కుదించారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా తమిళ కవి గురించి మాట్లాడారంటే ముఖ్యమంత్రికి, ఆయన సహచర మంత్రులకు అక్కడ పెట్టుబడులు ఉన్నాయని అర్ధమవుతోంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ,  శ్రీ ముత్తా శశిధర్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way