పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం పొట్లి, నవగాం మధ్య ఉన్న వంతెన శిథిల స్థితిలో ఉన్న స్థానిక నాయకులు పట్టించుకోలేదంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే ఆయన స్పందించి చుట్టుపక్క గ్రామ జనసైనికులతో వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలావస్థలో ఉన్న బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఇటు నుండి వెళ్లే ప్రయాణికులకు నష్టం జరిగే పరిస్థితి ఉందన్నారు. వెంటనే నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేయని యెడల జనసేన పార్టీ తరపున ఉద్యమం చేపడతామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com