ఎమ్మిగనూరు, మార్చి26 (జనస్వరం) :ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 39వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మణ్ టాకీస్ సమీపంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ ని తండ్రి యొక్క సేవ స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటితరం యువకులకు అభిమానులకు ఆదర్శంగా నిలిచిన నటుడు రామ్ చరణ్ ని తెలియజేశారు. రాబోయే కాలంలో రామ్ చరణ్ మరెన్నో విజయాన్ని సాధించాలని ఆయన చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రషీద్, రమేష్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com