గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండల కేంద్రంలో మేధోమథనం కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా ఏ విధంగా తీసుకెళ్లలో చర్చించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడి మన నియోజకవర్గంలో జనసేన జండా ఎగిరేలా కృషి చేద్దామని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమానికి కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, గంగాధర నెల్లూరు మండల ఉపాధ్యక్షులు వేంకటాద్రి, యస్ ఆర్ పురం మండలం అధ్యక్షులు చిరంజీవి, కర్వేటినగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, సెల్వి, ప్రధాన కార్యదర్సులు వెంకటేష్, నరేష్, చంద్రమౌళి, నరసింహులు, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్సులు భాను ప్రకాష్, రాఘవ, పాలసముద్రం మండల ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి ఆకాష్, గంగాధర నెల్లూరు మండల ప్రధాన కార్యదర్శి శివ, సంయుక్త కార్యదర్శి కేశవులు, జనసేన నాయకులు భరత్, శివ, అజయ్ పాల్గొన్నారు.