న్యూస్ ( జనస్వరం ) : జనసైనికుడు లంకె సతీష్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో క్రుంగదీస్తున్న లంకె సతీష్ ఈ వ్యాధితో బాధపడటం మరింత మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదు. ఆపరేషన్ చేస్తే కానీ నయం కాదని వైద్యులు తెలియజేశారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ – చంటి గారికి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి లంకె సతీష్ కు ఆపరేషన్ ఏర్పాట్లు చేయించారు. అందుకు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ టీం 7 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. ఇపుడు లంకె సతీష్ ఆరోగ్యంగా ఉన్నారు. లంకె సతీష్ మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన చంటి గారికి, వారి టీం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ ను అభినందిస్తున్నారు.