రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం కేశనపల్లి గ్రామనికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుగారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. వీరంతా ఈరోజు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవారు. స్థానికంగా ఉన్నసమస్యలపై పోరాటం చేస్తూ వారికి న్యాయం జరగని కారణంగా బొంతు రాజేశ్వరరావు గారి స్వగృహం వద్ద కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపిపి శ్రీమతి మేడిచర్ల సత్యవాణి రాము, కేశనపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అడబాల నాని, మాజీ సర్పంచ్ యానుముల బాబ్జి, అడబాల వెంకటేశ్వర, మేకల ఏసుబాబు, విపర్తి సాయిబాబు, గెడ్డం సుందర రావు, మందపాటి సత్తిబాబు, బందెల రత్న రాజు, వీర కృష్ణ, పోలిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com