తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా ఇటీవల రోడ్ ప్రమాదంలో గురి అయి L. అగ్రహారం గ్రామానికి చెందిన జనసైనికుడు యోగి కళ్యాణ్ ని పరామర్శించి వైద్య ఖర్చుల కోసం 10000 రూపాయలు ఆర్థిక సహాయంచేశారు. తాడేపల్లిగూడెం మండలం అమృత పురం గ్రామంలో రుద్ర ఏడుకొండలు గారి తాటకిళ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి నేను అండగా ఉంటా అని ఆ కుటుంబానికి బరోసా ఇచ్చారు. అనంతరం తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం గ్రామనికి చెందిన పుట్ట పోతురాజు కుమారుడు పుట్ట శ్రీను అకాలంగా మరణించడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసి వారి కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థికసహయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, యంట్రపాటి రాజు, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, నలగంచు రాంబాబు, అడబాల మురళి, కోట శ్రీ రామ్, పిడుగు మోహన్ బ్రదర్స్, రుద్ర రమేష్, రుద్ర శేషగిరి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.