తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : జనసేనపార్టీ జనసైనికుడు మైలవరపు రాజాని అక్రమ అరెస్ట్ చేయడానికి వచ్చిన మచిలీపట్నం పోలీస్ లను అడ్డుకొని శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులపై దృష్ట ప్రచారం చేశారు అనే నేపంతో రాజా ఇంటికి తెల్లవారు జామునే సానిటరీ ఆఫీసర్స్ అని చెప్పి మచిలీపట్నం నుంచి ఎస్ ఐ కానిస్టేబుల్స్ ఎలాంటి నోటీస్ లేకుండా రావడం ఇంటిలో ఉండేవారిని భయబాంత్రులు చేయడం ఒక్క వైసీపీ ప్రభుత్వం లోనే చెందుతుందని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా అనే వ్యక్తీ సోషల్ మీడియాలో వైసీపీ చేసే అక్రమాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ జనసైనికులకు అండగా ఉంటూ దీటుగా నిలబడే వ్యక్తి అని అలాంటి తన దగ్గరకు ఏ నోటీస్ లేకుండా రావడం నోటీస్ అడిగినందుకు చేతిలో ఉన్న ఫోన్ తీసుకువెళ్లడం పోలీస్ వారికి సిగ్గు చేటు అని వైసీపీ రాజకీయ నాయకులకి పోలీస్ వారు తోలుబొమ్మలయ్యాలని సీఎం జగన్ ఎంత కక్షతో రగిలిపోతున్నారో ఈ అక్రమ అరెస్టే నిదర్శనం అని అన్నారు. ఈ పాలనలో ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నారనీ ప్రతిరోజూ పవన్ కళ్యాణ్ పై, జనసేన నాయకులపై విమర్శలు చేస్తున్నా వారిపై ఒక్క చర్యా లేదన్నారు. తాము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అన్నారు.
జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారిందన్నారు. ఎంత సేపూ ప్రశ్నించే వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఏం చేసినా జనసేన నాయకులు, సైనికులు నోరెత్తకుండా చేతులు కట్టుకొని ఉండాలా? అని ప్రశ్నించారు. జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైఎస్సార్సీపీ అరాచక పాలనపై పోరాటం ఆగదన్నారు. ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదంతో శ్రీనివాస్ మరియు జనసేన నాయకులతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, లైజినింగ్ కమిటీ సభ్యులు అడబాల నారాయణమూర్తి, సోమా శంకర్ యాదవ్, నీలపాల దినేష్ యాదవ్, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణి కుమార్, కేశవబట్ల విజయ్,మీడియా ఇంఛార్జ్ బయనపాలేపు ముఖేష్,జనసేనపార్టీ నాయకులు నలగంచు రాంబాబు, గుండుమోగుల సురేష్, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, గట్టిం నాని, మద్దాల నరసింహ, సంతోష్, దాగారపు శ్రీను, ఏపూరి సాయి, మల్లేశ్వరరావు, రుద్రా రమేష్,స్వామి నాయుడు,పిడుగు మోహన్ బ్రదర్స్,అత్తిలి బాబీ,సోమ శంకర్ పట్టణ వీరమహిళ అధ్యక్షురాలు వెజ్జు రత్న కుమారి, పెంటపాడు మండల వీరమహిళ అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, మద్దుల చిన్ని, మధుమతి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com