తాడేపల్లి గూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లయ్య గూడెం గ్రామంలో పెదమూర్తి ముసలయ్య గారి ఇల్లు గ్యాస్ బండ పేలి దగ్ధమైంది. సంఘటన తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంఘటాన స్థలానికి చేరుకుని బాధితులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు వస్త్రాలు దుప్పట్లు పదివేల రూపాయలు సహాయం అందజేశారు. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, అడ్డగర్ర సూరి, పుల్లయ్య గూడెం ఆకుల శ్రీను, బద్దిరెడ్డి వాసు, గంగాధర్, పండు మరియు జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com