తాడేపల్లి గూడెం ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా అంగన్వాడీలు సమ్మెకు పిలుపునివ్వడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక తాడేపల్లిగూడెం పట్టణ తాలూకా ఆఫీస్ వద్ద మరియు పెంటపాడు మండలంలో అంగన్వాడీలు చేస్తున్న ధర్నాలో పాల్గొని వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్న అంగన్వాడీల ఆవేదన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదన్నారు. ఎలక్షన్ కి ముందు అంగన్వాడీలు నా అక్కాచెల్లెళ్ల అంటూ, అధికారంలోకి రాగానే మీ స్థితి మార్చేస్తానని తెలంగాణ కన్న 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానంటూ సీఎం జగన్ ప్రగల్బలు పరికారనీ, అధికారంలోకి వచ్చాక మాత్రం అక్క చెల్లెల శత్రువులయ్యారని ఆడబిడ్డల్ని అని చూడకుండా అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటున్న కనీసం అంగన్వాడీల మాటలను సీఎం జగన్ ఆలకించడం లేదని అంగన్వాడీలు వాపోయారన్నారు. వెంటనే అంగన్వాడీల సమ్మె ని ఒక కొలిక్కి తీసుకువచ్చి వారికి న్యాయం జరిగేలాగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మండల అధ్యక్షులు పుల్లా బాబి , రూలల్ అధ్యక్షులు అడపా ప్రసాద్, యంట్రపాటి రాజు, సోమా శంకర్ యాదవ్, అడ్డగర్ల సూరి, నల్లగంచు రాంబాబు, మద్దాల నరసింహ, గట్టిం నాని, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, సర్పంచులు కూడవల్లి హనుమంత్, బోనిగె పోతన తదితరులు పాల్గొన్నారు.