తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : నియోజకవర్గం లో శనివారం నాడు పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం చింతపల్లి గ్రామ నుండి మండల అధ్యక్షుడు పుల్లా బాబి అధ్యక్షతన కొండపల్లి నాగు, కోటిచుక్కల దర్గారావు ఆధ్వర్యంలో యిందుకూరి రామరాజు, వేములమంద శ్రీమన్నారాయణ(శివరాజు), యిందుకూరి శింగరాజు, వేములమంద పుల్లంరాజు, నడుంపల్లి సుబ్బరాజు గార్లు వారి అనుచరులతో సుమారు 50 మందితో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం తాడేపల్లిగూడెం రూరల్ మండలం బంగారు గూడెం గ్రామంలో జనసేన నాయకులు బీసీ నాయకులు మట్ట రామకృష్ణ ఆధ్వర్యంలో గౌడ సంఘం నుంచి మీడ్డే మునేశ్వర్రావు, పలివేల వెంకట కృష్ణ, వారి అనుచరులతో బొలిశెట్టి సేవ గుణాలు నచ్చి సుమారు 50 మంది వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం స్థానిక తొమ్మిదో వార్డు శేషమహల్ రోడ్డు ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ నందు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ముఖేష్, కేశవ, హరినాథ్, రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనంలోకి జనసేన “టీ” గ్లాస్ అనే కార్యక్రమంలో శ్రీనివాస్ ఉచిత టీ మరియు గాజు గ్లాసును అక్కడ స్థానికులకు అందజేశారు. అనంతరం దూలం విజయకుమార్ వార్తనపల్లి కాశి గారి ఆధ్వర్యంలో 30 మందికి పైగా అక్కడ యువతను జనసేన కండువా కప్పి బొలిశెట్టి పార్టీలోకి ఆహ్వానించారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సేవా కార్యక్రమాలు నచ్చి ఈ వైసీపీ అనే అడ్డుగోడలు పగలగొట్టుకొని స్వచ్ఛందంగా జనసేన పార్టీలోకి రావడం ఆనందదాయకం అన్నారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామం నుంచి ప్రజా సేవకులు వారికి ఉన్న పొలాల్లో సగం వారి ఊరి ప్రజలకు ఇవ్వడం, ఎల్లప్పుడూ వారు ఆ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే శివ రాజు, రామ రాజు, మన పార్టీ లో ఉండడం అంటే జనసేనకు కొండంత బలం అని, అంతే కాకుండా బంగారు గూడెం నుంచి మట్ట రామకృష్ణ ఆధ్వర్యంలో గౌడ సంఘం నుంచి జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా తరఫున అండగా ఉంటానని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెం టౌన్ 9వ వార్డు నుంచి యువత జనసేనపార్టీ లోకి రావడం, యువతను ఉద్దేశించి కులాలకు మతాలకు యువత అండగా నిలబడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం స్థానిక శేషమహల్ రోడ్ N T R బొమ్మ దగ్గర జరిగిన జనంలోకి జనసేన “టీ” గ్లాస్ అనే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మా గాజు గ్లాస్ యొక్క గుర్తు ప్రజల్లోకి చేరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖేష్, కేశవ, హరినాథ్, రామకృష్ణ లను బొలిశెట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.