తాడేపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న జరిగిన భీమవరం మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉందనీ ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారనీ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ నా ఎస్సీ సోదరులు, నా ఎస్టీ సోదరులు, నా బి.సి సోదరులను చెప్పే మీరు ఏ ఒక్క ఎస్సీ కైనా, ఎస్టీకైనా న్యాయం చేశారనుకుంటే మీ మనసాక్షికే వదిలేస్తున్నానని, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి, పెళ్లాల గురించి మాట్లాడే మీరు మీ కుటుంబంలో వారి గురించి వారి పెళ్లిలు గురించి మాట్లాడితే మీరు ఏం చేయగలగుతరని అన్నారు. కానీ మా అధ్యక్షుని పార్టీ క్రమశిక్షణతో కూడుకున్నదని అదే క్రమశిక్షణతో ప్రజల్లో ఆదరణ పొందిన పార్టీ ఉందంటే జనసేన పార్టీ అనీ, అదే మీ వైసీపీ పార్టీలో ఒక దళిత డ్రైవర్ ను చంపి పార్సిల్ చేస్తే కనీసం పట్టించుకోలేదని అన్నారు. ఒక దళిత డాక్టర్ ను పిచివాడిగా ముద్రవేస్తే నువ్వు చేసిన న్యాయం ఏంటి సి.ఎం.గారు అనీ బొలిశెట్టి అన్నారు. మా వ్యక్తిగతం గా మాట్లాడితే మేము కూడా మీ మంత్రులు చేసే వాటిపైన మాట్లాడవలసి వస్తుందనీ అంతే కాకుండా ఎవరైనా నా టికెట్ గురించి గాని, నేను పార్టీ మారుతున్నాను అని పోస్ట్లు పెడితే అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్ల బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్,జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, లైజనింగ్ కమిటీ మెంబర్స్ మట్టా రామకృష్ణ, యాంట్ర పాటి రాజు, నీలిపాల దినేష్, ఉబయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, మాదాసు ఇందు, చాపల రమేష్, నల్లగంచు రాంబాబు, అడ్డగర్ర సూరి, అడబాల మురళి, బయనపాలేపు ముఖేష్, ఏపూరి సాయి, కోట శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.