విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన పర్యావరణ పరిరక్షణ విషయంలో మరొక ఘన విజయం సాధించింది. దీనిని తన భుజ స్కంధాలపైన వేసుకొని చివరి వరకు పోరాటం చేసి గెలుపు సాధించిన ప్రముఖ పర్యావరణవేత్త, జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఇక విషయానికి వస్తే పేదలందరికి ఇళ్ళు పేరుతో ఆవినీతి, అక్రమాలు చేయడం పరిపాటి అయింది జగన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇందులో భాగంగా యూనివర్సిటీ స్థలాలు, స్కూలు స్థలాలు, స్మశానాలు, మడ అడవులు, అటవీ భూములు, ఆవ భూములు అనేది లేకుండా ఎక్కడపడితే అక్కడ స్థలాలు తీసుకొని అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం చేస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ మడ అడవులను నాశనం చేసి అక్కడ పేదలకు ఇల్లు కట్టిస్తామని మాయ ప్రకటన చేయడంతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం పైన జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సాక్షాలతో సహా చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ శాఖలో కేసు నంబర్ 65/2020 దాఖలు చేశారు. దీనిపైన స్పందించిన ట్రిబునల్ పర్యావరణ విధ్వంసం పైన ఒక కమిటీ వేసింది. సదరు కమిటీ రిపోర్ట్ ప్రకారం తాత్కాలిక పరిరక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
సదరు ఉత్తర్వులోని స్థూల అంశాలు :
1. రాష్ట్ర ప్రభుత్వం కోస్తా రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘన చేయడానికి వీలు లేదు.
2. మడ అడవులను నిబంధనలు ఉల్లంఘన చేసే విధ్వంస౦ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు చేయకూడదు.
3. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా సముద్రపాయకి ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్ర జలాలు స్వేచ్ఛగా పారేలా చర్యలు తీసుకోవాలి.
4. పిడబ్ల్యుడి మరియు కాకినాడ పోర్టు వారు సంయుక్తంగా రహదారుల పైన ఉన్న మొక్కల పెంపకం కోసం అవసరమైన రక్షణ బాక్సులు ఏర్పాటు చేసి సముద్ర నీరు వాటికి అందేలా చర్యలు తీసుకోవాలి.
5. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 18 ఎకరాల భూమిలో జరిగిన మడ అడవుల విధ్వంసం తాత్కాలిక నష్టపరిహారం కింద ఐదు కోట్ల రూపాయలతో అక్కడ మరలా మడ అడవుల నిర్మాణం కోసం వెచ్చించాలి. ఈ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం తీర్పు వచ్చిన ఆరు నెలల లోపు చెల్లించాల్సిన బాధ్యత ఉన్నది. అలా చెల్లించని పక్షంలో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వారు వాటిని ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సిన బాధ్యత మరియు మడ అడవుల పెంపకం సంరక్షణ కోసం వెచ్చించాలి.
6. అక్కడ జరిగిన పూర్తిస్థాయి పర్యావరణ విధ్వంసం పైన విచారణ తగు ఆధారాలతో చేసి రిపోర్టు చేయడం కోసం ఒక 6 మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించారు. దీనిలో జాతీయ, రాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఇతరుల సభ్యులుగా ఉంటారు. వీరు ఆరు నెలల లోపు పూర్తి పర్యావరణ విధ్వంసం పైన విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ కి నివేదిక ఇవ్వాలి. సదరు రిపోర్టులో విధ్వంసం ఏ మేరకు జరిగింది, దాన్ని పునరుద్ధరణకు పరిరక్షణకు ఎంత మొత్తం నష్టపరిహారం అవసరం ఉంది. తదితర అంశాల పైన రిపోర్టు ఇవ్వాలి. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సదరు కమిటీ ఇచ్చిన నష్టపరిహారం మొత్తం సొమ్ము జమ చేయాలి.
7. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ అథారిటీ వారు సదరు సొమ్ము జమ చేసిన మూడు నెలలలో పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టి కనీసం వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో 85% పైగా అడవుల పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
8. సదరు కమిటీ మొత్తం అక్కడ ఉన్న 58 ఎకరాలలో మడ అడవుల పెంపకం పరిరక్షణ పైన కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి రిపోర్టు చేయాలి. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం దానిని కూడా తప్పక పాటించాలి.
9. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల మార్పు గాని ఉల్లంఘనలు గాని భవిష్యత్తులో చేయకూడదు, చేయనీయకూడదు, ఇలా పలు సూచనలతో పాటు ఉల్లంఘనల పైన పరిమితులు కూడా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com