తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 13 (జనస్వరం) : ప్రస్తుతం రెడీమేడ్ వ్యాపారాలు రాజ్యమేలుతున్న తరుణంలో చేతివృత్తుల వారికి ఆదరణ కరువైందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం లోని బొలిశెట్టి నివాసం వద్ద శనివారం టైలరింగ్ యూనియన్ సభ్యులు బొలిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి బోలిశెట్టికి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టైలరింగ్ వృత్తిదారులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే చేతివృత్తుల వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com