విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ జిల్లా వైయస్సార్సీపి సెక్రటరీగా పనిచేసిన బొగ్గు శ్యామ్ వైసీపీ పార్టీకి మరియు సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పి. వి. శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు నాయకులు లంకా త్రినాథ్, రఘు, సతీష్, నగేష్, గాజుల శీను, జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి మరియు నియోజకవర్గ నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com