
బొబ్బిలి ( జనస్వరం ) : ఉమ్మడి విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలం, కన్నంపేట గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన జెండా ఆవిష్కరణ మరియు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బాబు పాలూరు గారు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికి, గ్రామ స్వరాజ్యం జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని, కన్నంపేట గ్రామ ప్రజల నుంచి వచ్చిన అశేషమైన స్పందన, మీ మద్దతు 2024 వరకు ఇలాగే కొనసాగించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి, జనసేన ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ నాయకులు రేగు మహేష్, మక్కువ మండల నాయకులు గేదెల రిషి వర్థన్, సాలూరు మండల అధ్యక్షులు శివ, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, సీతానగరం మండల నాయకులు పోతల శివ శంకర్ మరియు జనసేన నాయకులు.