
బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం అప్పలరాజుపేట గ్రామంలో బంటుపల్లి దివ్య మరియు మహంతి ధనుంజయ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారి చేతుల మీదుగా ఆ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్ గారు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు గారు, వీర మహిళ G.రమ్య గారు జనసేన నాయకులు పొతల శివశంకర్ గారు, ఎందువ సత్య గారు, బొన్నాడ గణేష్ గారు, చీమల సతీష్ గారు, పారాది జనసైనికులు, అప్పలరాజుపేట జనసైనికులు, పెద్ద ఎత్తున ఆ గ్రామ మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. చేరికలకు ముందు, అప్పలరాజుపేట గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు ఇంటికి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధంతాలును, మేనిఫెస్టోను గ్రామ ప్రజలుకు వివరించడం జరిగింది. ప్రజలు కోసం తన సంపాదనను సైతం దానం చేస్తున్న నీతి, నిజాయితీ పరుడైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారికి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు.