
బొబ్బిలి ( జనస్వరం ) : రామభద్రపురం మండలం, అప్పలరాజుపేట గ్రామం నుంచి మన వీరమహిళ బంటుపల్లి దివ్య ఆధ్వర్యంలో కొంతమంది యువత ఈరోజు మన బొబ్బిలి జనసైనికుల నిలయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల నిర్వహణ విభాగం) బాబు పాలూరు గారు గ్రామ యువతకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం యువ నాయకులు మహంతి ధనుంజయ, బంటుపల్లి శంకర్, రమేష్, అప్పలరాజుపేట జనసైనికులు పాల్గొన్నారు.