సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 14వ తారీకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఆయన చేపట్టబోయే వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ ను ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర మొదలవుతుంది అనే విషయం తెలియగానే రాష్ట్ర వైసిపి ఉభయగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులనీ ప్రజలు వీళ్లేదో ఉద్దరిస్తారని వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళకిచ్చిన పదవులని వీళ్ళని నమ్మిన ప్రజలని మోసం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని దూషించడమే వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్రలో భాగంగా ఆయన ఏదైతే నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? రాజధాని ఎక్కడ పెరిగిన కరెంట్ బిల్లులు పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు అదేవిధంగా ఎక్కడ కూడా నాలుగు సంవత్సరాలు పాటు రాష్ట్రం అభివృద్ధి చెందిన దాఖలాలు నామమాత్రపు మంత్రులు నామమాత్రపు పరిపాలన తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా పరిపాలన కొనసాగించిన దాఖలు లేవు. వీటన్నిటి పై జనసేనని గళం వినిపించబోతుంది అనేటువంటి విషయాన్ని పసిగట్టి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పి విళ్ళని ఇంటికి పరిమితం చేస్తారని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, రహీం, శీనయ్య, సుధాకర్, వెంకయ్య, శ్రీహరి, చిన్న, ఫణి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com