Logo
Date of Publish : 12 April 2023, 5:10 pm
Editor : Sake Naresh

బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం

         సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని చిన్న చెరుకూరు పంచాయతీలో రెండవ రోజు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కొనసాగించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సురేష్ నాయుడు మాట్లాడుతూ చిన్న చెరుకూరు పంచాయతీ అరుంధతి వాడలో ప్రజలు వీధి లైట్లు లేక, సైడ్ కాలువలు పరిశుభ్రపరచకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. అదేవిధంగా పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరం. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త కూస్తో డబ్బులతో ఇళ్లు అయితే కొంతవరకు నిర్మాణం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే డబ్బు కావాలి ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న ఇళ్ల పట్టాలు ఎందుకని ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతుంది. ఎందుకని మంత్రి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం లేదు. త్వరితగతిన వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే జనసేన పార్టీ వాళ్లకి అండగా నిలబడి, వాళ్లకి ఇళ్ల పట్టాలు ఇచెంతవరకు పోరాడుతాం. అదేవిధంగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. మురుగు కాలువల్లో బ్లీచింగ్ కొట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో మేమే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సాయి, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం భాయ్, అగ్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com