సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలోని గురవయ్యశాల నందు 36వరోజు బుధవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంటే గ్రామపంచాయతీలో నిధులు, కాలువల్లో బ్లీచింగ్ కొట్టిన పరిస్థితులు లేవు. దోమల బెడదతో ప్రజలు అల్లాడిపో తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము అభివృద్ధి చేశాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారో ఏం అభివృద్ధి చేశారు అనే విషయాన్ని స్పష్టంగా సచివాలయాల దగ్గర బోర్డులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఇల్లు కట్టిస్తున్న అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణం జరిగిన పరిస్థితుల్లో ఇంకొక ఆరు నెలకి సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆరు నెలల్లో ఇల్లు కట్టగలరా నాలుగున్నర సంవత్సరం పేదవాడి సొంత ఇంటి కల నిర్మాణం చేయలేని ప్రభుత్వం ఆరు నెలల్లో ఏం చేయగలదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయేది జనసేన ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ అధికారంలోకి రాంగానే ఏది ఆగదు ప్రజలకి అండగా ఉంటూ రాష్ట అభివృద్ధి, యువత భవిష్యతే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు సుమన్, జనసేన నాయకులు శ్రీహరి, హరి, ధనుంజయ, శ్రీనయ్య, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com