పవనపుత్ర డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మత్శ్యకర పశు సంరక్షణ మంత్రి గారి భార్య శ్రీదేవి గారు అతిధులుగా పాల్గొన్న పలాస MRO మధుసూధనరావు గారు, పలాస MPDO రమేష్ నాయుడు గారు, పలాస గవర్నమెంట్ హాస్పిటల్ సూపరెండెంట్ రమేష్ గారు, MJPAPDCWR స్కూల్ అక్కుపల్లి ప్రిన్సిపాల్ ముంజేటి పాపారావు గారు, SBSYM డిగ్రీ కాలేజీ PD మేజర్ మధుగారు పాల్గున్నారు Ex ఆర్మీ పలాస సభ్యులు పాల్గున్నారు ఈ కరోనా సమయంలో చాలా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో సరైన సమయానికి రక్తం అందక చాలా మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పవనపుత్ర బ్లడ్ డోనర్స్ మరియు ఎక్స్ ఆర్మీ టీం పలాస వారు సంయుక్తంగా ఈరోజు కేంద్ర పురం గ్రామం పలాస మండలం లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం వారు నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కబీర్ గా కేదారిపురం తీవ్ర పెళ్లి గంగువాడ గోదావరి గ్రామ యువత పాల్గొన్నారు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఎక్స్ ఆర్మీ టీం మరియు టీచర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ మరియు ఎక్స్ ఆర్మీ ఇన్ పలాస వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో మొత్తం 76 మంది విద్యార్థులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది . ఈ 76 యూనిట్స్ బ్లడ్ ప్యాకెట్స్ నిక్ నేమ్స్ హాస్పిటల్ వారు కి అందించడం జరిగింది. డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా మంచి పరిణామమని అలాగే యువత ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం స్వచ్ఛందంగా చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారని వారందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలాస లో బ్లడ్ యూనిట్ సెంటర్స్ టాప్ స్థాపిస్తున్నామని తెలియజేశారు. పలాస మల్లేశ్వర రావు హాస్పిటల్ ఎండి అయినటువంటి మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ ఇంతకు ముందు రోజుల్లో బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బంది పడే పలాస మల్లేశ్వర రావు హాస్పిటల్ ఎండి మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ ఇంతకు ముందు రోజుల్లో బ్లడ్ దొరక్క చాలామంది ఇబ్బంది పడే వారు కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత రక్తం అవసరమన్న వెంటనే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. యువత ప్రతిఒక్కరు రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పలాస MPDO రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ పవనపుత్ర బ్లడ్ డోనర్స్ వారు రక్తదానం నిర్వహించడం అభినందనీయం. రక్తదాన శిబిరంలో సేకరించిన యూనిట్స్ గవర్నమెంట్ సంస్థ ఐనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ RIMS వాళ్ళకి ఇవ్వడం గొప్పవిషయం అన్నారు. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థకు ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. MJPAPDCWR స్కూల్ అక్కుపల్లి ప్రిన్సిపాల్ ముంజేటి పాపారావు గారు మాట్లాడుతూ సమాజం రక్తదానం పై చాలా అపోహలు ఉన్నాయని అవి బాల్యంలోనే పోగొట్టాలని అందుకుగాను స్కూల్ స్థాయిలోనే పిల్లా పాఠ్యాంశంలో రక్తదానం కోసం చేర్చాలని మరియు గవర్నమెంట్ మాజీ సైనికులకు కొంత స్థలాన్ని కేటాయించి వారిచేత ప్లేనిటేషన్ చేయించాలని కోరారు. మేజర్ డాక్టర్ మధు గారు మాట్లాడుతూ మా NCC లో శిక్షణ పొందిన ఎంతోమంది యువకులు భారత సైనికులుగా దేశ సేవలు అందిస్తున్నారు. సైనికులుగా సేవలు అందించి పదవి విరమణ పొందినతరువాత ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందించింన విషయం అన్నారు.పవపుత్ర బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు మజ్జి భాస్కరరావు మాట్లాడుతూ బ్లడ్ క్యాంపు కి సహకరించిన ex ఆర్మీ టీం కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. మన సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, రక్తదానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అని తెలియజేసారు.ఈ కరోనా సమయంలో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సంస్థ నేరుగా వెళ్ళి రక్తదానo చెయ్యడం మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా 1000యూనిట్స్ అందించడం జరిగింది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లి పాల్గుణరావు, హనుమంతు జనార్ధనరావు, హనుమంతు వెంకటరావు టీచర్, పోలాకి సోమేశ్వరరావు, ఆసపన్న బాలరాజు, చలపతి, కనగల షణ్ముఖరావు మరియు పలాస పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.