శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి 106 డివిజన్ అద్యక్షురాలు శ్రీమతి దొంతోజు ఇందుమతి నాయకత్వంలో మరియు మధర్ధెరీస్సా బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్థానిక శారద విద్యా నికేతన్ వారి ప్రాంగణంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యకరమానికి జనసేన పార్టీ కార్యకర్తలు యువకులు విశేషంగా పాల్గోని రక్తదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం ద్వారా రక్తం అందక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది చిన్నారుల జీవితాలలో వెలుగు నింపుతుందని తెలియచేశారు. సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ రక్తదాన శిభిరం కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శారద విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ రామాచారి గారికి మరియు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే నియోజక వర్గ జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com