జనసేన ఆధ్వర్యంలో మధ్య గ్రామంలో రక్తదాన శిబిరం సంక్రాంతి సందర్బంగా జనవరి 11వ తేదీన మధ్య గ్రామంలో జనసేన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో 43 జట్లు పాల్గొన్నారు. ఫైనల్ కు బలిగాం మరియు సున్నాడా జట్లు చేరాయి. ఫైనల్ లో సున్నాడా మొదటి బాటింగ్ చేసి 10 ఓవర్ల కు 57 రన్స్ చేశారు. బలిగాం జట్టు 3.4 ఓవర్స్లో 58 రన్స్ చేసి విజేతగా నిలిచింది. టోర్నమెంట్ ఫైనల్ సందర్బంగా మందస మండలం జనసైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 23 జనసైనికులు పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎచ్చర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు క్రాంతి సయ్యద్ గారు, పాతపట్నం నియోజకవర్గం జనసేన నాయకులు గేదెల చైతన్య గారు, పలాస నియోజకవర్గం జనసేన నాయకులు సుజాత యాదవ్ గారు, రేగటి నవీన్ గారు, పలాస బి జె పి నాయకులు కొర్ల కన్నారావు గారు పాల్గొన్నారు. టోర్నమెంట్ లో రన్నర్స్ సున్నాడా మరియు విన్నర్ బలిగాం జట్లకు ప్రైజ్ మనీ తో పాటు కప్ ని అందించారు. ఈ కార్యక్రమంలో మధ్య గ్రామం జనసైనికులు, మందస మండలం జనసేన మరియు బి జె పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.