రాయదుర్గం ( జనస్వరం ) : కనేకల్ మండలం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జనసేన టిడిపి పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ కరేగౌడ మంజునాథ్ గౌడ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు, జనసేన గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ మరియు జనసేన, టిడిపి పార్టీల కుటుంబ సభ్యులు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వాసగిరి మణికంఠ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈరోజు మా కంస మామ నిరంకుశ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి రంజాన్ తోఫా, దుల్హన్ స్కీం లాంటి సంక్షేమ కార్యక్రమాల్ని పక్కన పెట్టడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం. గత ప్రభుత్వంపై కక్ష కారణంగా రాయదుర్గంలో గతంలో చేస్తున్న అభివృద్ధి పనులన్నీ నింపివేయడం, మొన్నటి వరకు కాపు కాసిన ప్రస్తుత ఎమ్మెల్యేని అసమర్థుడు అని తీసిపారేయడం, ఆయన అసమర్ధ పాలనను ఆయనే ఒప్పుకున్నట్టు అని అన్నారు. ఇలాంటి సందర్భంలో మనల్ని అభివృద్ధి వైపు నడిపించే సమర్థత ఉన్న మాజీ మంత్రివర్యులు కాల్వ శ్రీనివాసులు అన్నను, యువ నాయకుడు మంజునాథ్ లాంటి వాళ్ల నాయకత్వాన్ని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో జనసేన టిడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు ఒక్కరు కృషి చేయాలని ఉద్ఘటించారు… ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నియోజకవర్గం పట్టణ, మండల నాయకులు కనేకల్ మండల అధ్యక్షులు రవికుమార్, హర్షవర్ధన్, శివరాజ్, మహబూబ్ బాషా, సికందర్, మాల్యం రాము, పోతప్ప, ప్రశాంత్, లాలుస్వామి, వన్నూర్, రాజశేఖర్, రంజిత్ కుమార్, ఆఫ్రిది, మరియు తెలుగు దేశం ముఖ్యనాయకులు లాలెప్ప, సుదర్శన్, నవీన్ కుమార్, సందీప్, మారుతీ జనసేన, టిడిపి పార్టీల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.