Logo
Date of Publish : 05 May 2021, 3:14 pm
Editor : Sake Naresh

తృణమూల్ గూండాలను శిక్షించాలని ఇంట్లో దీక్ష చేపట్టిన బీజేపీ అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి

                  భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పశ్చిమబెంగాల్లో దాడులు జరుగుతున్న తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపుమేరకు నిరసన కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి అనంతపురం నగరంలో తన స్వగృహం లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ దాడుల్లో మరణించిన తొమ్మిది మంది బిజెపి కార్యకర్తలకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు వారి మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విధాన సభ ఎన్నికలు ముగిసిన అనంతరం టి. ఎం సి గెలిచింది. భారతీయ జనతా పార్టీ టి ఎం సి ని ఎదురొడ్డి నిలబడ్డ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కాదని అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది. దీన్ని ఓర్చుకోలేనిది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నేతలు కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా పార్టీ సౌజన్యంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తూ ఆస్తులను దోచుకుంటూ దొరికిన కాడికి దొరికినది దోచుకోవటం హత్యలు చేయటం లూటీ చేయటం స్త్రీలను మానభంగాలు చేయడం ఆస్తులను అగ్నికి ఆహుతి చేయటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో ఇదివరకటి కమ్యూనిస్టు పార్టీ రౌడీయిజం గుండాయిజం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారే ఈరోజు టిఎంసి ముసుగు ధరించి టీఎంసీ కార్యకర్తగా చలామణి అవుతూ భారతీయ జనతా పార్టీ క్యాడర్ మీద అ దౌర్జన్యాలు చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఒకవైపు దాడులు మానభంగాలు జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ ఖండించలేదు. దేశంలోని కుహనా లౌకిక వాదులు కూడా ఈ దాడులను ఖండించలేదు.

               మాల్దా, ముజఫర్నగర్ వంటి జిల్లాలలో మైనారిటీలను అంటూ ముసుగు ధరించి 66% పైగా జనాభా కలిగిన వారు ఈ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ముక్కుమడిగా టి.యం.సి ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా సిపిఎంతో తలపడుతున్న మంటూ పశ్చిమ బెంగాల్ లో మాత్రం సిపిఎం మరియు మతతత్వ పార్టీ లతో కలిసి పోటీ చేసిన విషయాన్ని ప్రజాస్వామ్య వాదులు గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీకి చెందిన కమల్ బండల్ అనే కార్యకర్త జగిత్యాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 177 అధ్యక్షులు అయితే వారి తల్లిని తృణమూల్ కాంగ్రెసు గుండాలు అటాక్ చేశారు హత్య చేశారు. మరొక భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అభిజిత్ సర్కార్ ను దారుణంగా హత్య చేసి అతనికి సంబంధించిన ఐదు కుక్క పిల్లలు కూడా హత్య చేయడం జరిగింది. వేలాది ఇళ్లను మరి ఈ షాపులను లూటీ చేయడం జరిగింది ఇదంతా TMC సౌజన్యంతో జరుగుతున్న దాడులు నందిగామ లో మరియు భారతీయ జనతా కార్యలయం మీద పార్టీ నేథల మీద మరియు ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థుల మీద దాడులు చేయడం జరిగింది. వీటన్నిటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మమతాబెనర్జీ ఈ దాడులను ఖండించలేదు మమతా బెనర్జీ తన ఫాసిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. పోలీసులు, గవర్నమెంట్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న సందర్భం మనమందరము గమనిస్తున్నాం.

                 తోటి సోదర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయిన వెస్ట్ బెంగాల్ సోదరులకు ఒకటే విజ్ఞప్తి ఈ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. దేశంలోని కార్యకర్తలందరూ అండగా ఉన్నారని తెలియజేసన్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎరోజు కూడా దౌర్జన్యాలకు దాడులకు దిగింది లేదు. టీఎంసీ కార్యకర్తలు మాత్రమే రెచ్చగొట్టే ధోరణితో ఊరేగింపులూ బహిరంగ సభలో చేస్తూ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు మమతా బెనర్జీ లభించిన ఈ విజయము ప్రజా విజయంగా బిజెపి భావిస్తున్నది. 2016లో భారతీయ జనతా పార్టీకి పశ్చిమబెంగాల్ ఓటర్లు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారు. గత ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా టీఎంసీ కి వ్యతిరేకంగా టిఎంసి ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ఉద్యమాలు చేయడం వలన ఈ రోజు పార్టీ 77ఎం‌ఎల్‌ఏలను అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా 2016లో లో 5.6 శాతం ఓట్లతో 55 లక్షల ఓట్లను సాధించింది 2021 ఎన్నికలలో 38.1 శాతం ఓట్లతో 2 కోట్ల 28 లక్షల ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధించిన దీన్నంతటినీ టి.ఎం.సి నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేక భారతీయ కార్యకర్తల మీద అ దాడులు చేస్తున్నారు. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com