Logo
Date of Publish : 06 May 2021, 3:47 pm
Editor : Sake Naresh

అనంత ఆసుపత్రిలో జరిగిన సంఘటనను రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ జరపాలి : బీజేపీ నాయకులు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి

                  ఆక్సిజన్ సరఫరా లోపంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో సంభవించిన మరణాలకు సంబంధించిన విచారణ స్థానిక జిల్లా అధికారులతో విచారణ జరపరాదని బీజేపీ నాయకులు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు కోరారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో శుక్రవారం(April 30) సాయంత్రం నుండి శనివారం(01-05-2021) వరకు ఆక్సిజన్ సరిగా అందక ఆసుపత్రిలోనే 22 మంది మృతి చెందారు. ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మరియు అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో జరిగినటువంటి ఆక్సిజన్ సరఫరా సరిగా లేక మరణించడం, మరణాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనంతపురంలో జరిగిన మరణాలకు సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ సరిగా సరఫరా లేక పైపుల ద్వారా తగినంత ఆక్సిజన్ సరఫరా లేక గత శుక్రవారం, శనివారము 22 మంది మరణించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాలు మీద విచారణ చేసే సందర్భంలో జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక అధికారులను విచారణలో పక్కన పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.మనం పరిశీలించినట్లయితే జిల్లా అటవీ శాఖ అధికారి ఆక్సిజన్ సరఫరా నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు. అదేవిధంగా కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా అధికారులు విచారణ జరిపి నట్లయితే నిజాలు బయటికి రావు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలను ఆలోచించి రాష్ట్రానికి చెందిన నా ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని విచారణ కమిటీ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా విచారణ జరిపి అదేవిధంగా మరణించిన వారి కుటుంబ సభ్యులతో అభిప్రాయాలు తెలుసుకుని అక్కడ ఉన్న లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి జరిగిన సంఘటన బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా విచారణ నివేదికను హైకోర్టు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి కోరుతున్నది. నివేదిక స్థానిక అధికారులు సంఘటనపై విచారణ జరిపించినట్లయితే నిజాలు బయటకు రాకుండా ఉండటానికి అవకాశం ఉన్నది. క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే ఆస్పత్రి లో ఉన్నటువంటి మరిన్ని లోపాలు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది తద్వారా పరిస్థితులను మరింత మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చెందిన స్థానిక అధికారులతో కాకుండా రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో మొత్తం సంఘటనలనూ విచారణ జరిపి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాలని బిజెపి కోరుచున్నదని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com