నగిరి నియోజకవర్గం నందు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేయటం చూస్తూన్నాం. నగరి జనసేన నాయకులు దేవ మాట్లాడుతూ భారత దేశంలో ఆంధ్రరాష్ట్రంలో చేనేత పవర్ లూమ్స్ మీద ఆధారపడిన నియోజకవర్గం మన నగరి పట్టణం అని అన్నారు. సుమారు 10 వేల కుటంబాలు, 45 వేల మంది ఈ చేనేత ఆధారిత మీద ఆధారపడి బతుకుతున్నారు. చేనేత వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి కూడా 24వేలు సహాయం చేయాలి. చేనేత వాళ్లకి కూడా అందరికి అందలేదు కేవలం 40 శాతం మాత్రమే ఇచ్చారు అని ఆయన ధ్వజమెత్తారు. 70 కోట్లు టర్నోవర్ ఉన్న మన నగరిని చేనేత పట్టణంగా అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన నగరికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అలాంటి మన నగరాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు గాలికొదిలేశారని అన్నారు. జనసేన మరియు బీజేపీ నాయకులు కలసి చేనేత ఆధారిత వ్యక్తులను కలసి వారి సమస్యలను వినడం జరిగింది. అలాగే వారి సమస్యలను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని అన్నారు. అలాగే చేనేత వారికి ఇచ్చినట్టుగా ఈ పవర్ హ్యాండ్ లూమ్స్ ఆధారంగా పని చేసేవారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న చేతన్న హస్తం అందించాలని సంబంధిత MRO గారికి వినతి పత్రం అందచేయడం జరిగింది. దీనికి గాను ఎమ్మార్వో గారు స్పందిస్తూ ప్రభుత్వ వర్గాలతో చర్చించి తగు పరిష్కారం చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవ, ఉపేంద్ర, మోహన్, భాస్కర్, మని, చందు, బిజెపి నాయకులు రాజశేఖర్ రాజు, పొన్నప్పన్, తదితర సీనియర్ బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com