మంగళగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో అమరజీవి " శ్రీ పొట్టి శ్రీరాములు " గారి జయంతి సందర్భంగా ఆయని చిత్రపటానికి పూలమాలవేసి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ రోజున అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మా పార్టీ నాయకులతో కలిసి ఆయనీ చిత్రపటానికి పూలమాల వేసి జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగిందని, తెలుగు ప్రజల కోసం తెలుగు రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి మరవలేనిదని, ఆయన త్యాగానికి ప్రతిరూపం మన ఆంధ్ర రాష్ట్రమని, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభ ప్రాంగణానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు నామకరణం చేయడం జరిగిందని, పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తితో మనం కూడా కలిసికట్టుగా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి అధికారం వచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేవిధంగా కృషి చేయాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com