విజయవాడ, (జనస్వరం) : స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు ఆగస్టు 15న కాదు ఆగస్టు 9న అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పొతిన మహేష్ ద్వజమెత్తారు. పుట్టని రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి వ్యవహారం చూస్తుంటే బ్రహ్మానందం దీపావళి పండగను వినాయక చవితి రోజున చేసుకున్న పెళ్లి చేసుకుందాం సినిమా సీను గుర్తొస్తుందన్నారు. హిందూ హైస్కూల్లో మీరు చదివిన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ను బయటపెట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మీరు 2014, 2019 ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ క్లాస్ అని డిక్లరేషన్ ఇచ్చారు. ఆ ఆధారంతోనే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారినీ ఘోరంగా అవమానిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును పశ్చిమ ప్రజల క్షమించరని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com