బయోమెట్రిక్ విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలి : జనసేన మురళి
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సూచనల మేరకు నిర్వహించిన ఒక సమావేశంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ రేషన్ షాపుల వద్ద బయోమెట్రిక్ విధానానికి ప్రత్యమ్నాయం తీసురావాలి అని రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర వేయవలసి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో బయోమెట్రిక్ శ్రేయస్కరం కాదని ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు బయోమెట్రిక్ నిలుపుదల చేశారు. అదే విధంగా రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారులకు ప్రత్యామ్నాయం తక్షణమే అమలులోకి తీసుకు రావాలి బయోమెట్రిక్ విధానం రేషన్ కోసం ఎక్కువ మంది ఒకేసారి రావడం వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంది ఇప్పటికే పది మంది డీలర్లు ఈ వైరస్ బారినపడి కన్నుమూశారని తెలిసి బాధ కలిగింది. డీలర్లకు కమిషన్ మొత్తాలు ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు వారందరికీ కరోనా బీమా సౌకర్యాన్ని అమలులోకి తీసుకు రావాలి. అని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.