● సమస్యలపై ప్రశ్నిస్తే - సమాధానం ప్యాకేజినా
●అభివృద్ధి చేయడం చేతకాని మంత్రి పదవులు అవసరమా
● దేశంలో తిట్ల శాఖలు బూతు శాఖలు కలిగిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం
●జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికార చైర్మన్ ఎమ్మిగనూరు ఇంచార్జి రేఖగౌడ్
ఎమ్మిగనూరు, (జనస్వరం) : రాష్ట్రంలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర మంత్రులు భారత రాజ్యాంగాన్ని విస్మరించేలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తిట్ల శాఖలు భూతు శాఖలు ఏర్పాటు చేసుకొని బటన్ నొక్కే ముఖ్యమంత్రిని పొగడ్తలతో అభివృద్ది చేయమని అడిగే ప్రతిపక్ష నాయకులను తిట్లతో కాలయాపన చేసే భజన మంత్రి పదవులు శాశ్వతం కాదని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికార చైర్మన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పలు విమర్శలతో రాష్ట్ర మంత్రులను హెచ్చరించారు. పార్టీ రంగులతో హంగులు ఆర్భాటాలు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంలో గొప్పలు చెప్పుకొనే మీరు జనసేన అధినేతను విమర్శిండం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కి అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం గర్జన పేరుతో సభలు నిర్వహిస్తే ఎవరికి ఉపయోగమని అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి చేతకాని ప్యాకేజి బూతు మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఒక్కో బూతు మంత్రికి ఒక్కో చరిత్ర వుందని మీ రాజకీయ చరిత్రలపై విమర్శలు చేస్తే తట్టుకోలేరంటూ నిప్పులు చెరిగారు. అవగాహనలేని శాఖల్లో ఏమి చెయ్యాలో తెలియక బూతులే ప్రధాన ఎజెండగా పెట్టుకొని తిట్ల శాఖలలో కొనసాగుతూ ఎవరిని మెప్పిస్తున్నారని చేతనైతే మీకు కేటాయించిన శాఖల్లో నెలకొన్న సమస్యల సాధన కోసం కృషిచేయాలని హితవుపలికారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com