Logo
Date of Publish : 03 December 2023, 9:11 pm
Editor : Sake Naresh

రాతి ముఖ మండపానికి భూమి పూజ

      తిరుపతి ( జనస్వరం ) : వికృతమాలలో వెలసియున్న శ్రీ సంతాన సంపద వెంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా నూతన రాతి ముఖ మంటపానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భూమి పూజ చేశారు. ఆదివారం ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా రాతి మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ 24 రాతి స్థంభాలతో నిర్మిస్తున్న మండపాన్ని వచ్చే వైకుంఠ ఏకాదశిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వికృతమాలలో శిధిలావస్థకు చేరుకున్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కలిగించాడన్నారు. శ్రీవారి ఆశీసులతో పాటు తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రాతి ముఖ మండపం నిర్మిస్తే ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్, మునికృష్ణయ్య, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొని దిగ్విజయం చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com