రాజంపేట, (జనస్వరం) : ఊటుకూరు చెరువు నిండిన ప్రతిసారి ఎన్నో ఏండ్లుగా భువనగిరి పల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, హై లెవెల్ బ్రిడ్జి..గాలివారిపల్లి అలుగు, సున్నపురాళ్ల పల్లి అలుగు, భువనగిరిపల్లి అలుగు మూడు కలుసుకొని భువనగిరిపల్లి ప్రవేశ మార్గం గుండా చక్రాలమడుగులో కలుస్తాయి. భువనగిరిపల్లికి వెళ్లే దారిలో వంక మీద బ్రిడ్జి లేని కారణంగా సుమారు 1300 పైబడి జనాభా కలిగి ప్రతీరోజు రాజంపేటకు వెళ్లి కూరగాయల వ్యాపారాలు, కూలీపని చేసేవారు నిత్యావసర వస్తువులకు వెళ్లాలంటే ఆ నీటి ప్రవాహాన్ని దాటి వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు, స్కూల్ కి వెళ్లే పిల్లలు, ముసలివారు ఆ ప్రవాహాన్ని దాటి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా హామీలు ఇచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొంటారు తప్పా! గెలిచాక గ్రామ సమస్యల పట్ల శ్రద్ద చూపరని హరికృష్ణ అన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గానీ సర్పంచ్, MPTC మరియు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవడంలేదు అని మండిపడ్డారు. కేవలం ఒక చిన్న తాడు కట్టి పంచాయితీ అధికారులు చేతులు దులుపుకున్నారని వాపోయారు. దారి లేక రాజంపేటకు ప్రతిరోజూ జీవనాధారం కోసం వచ్చే గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తాత్కాలిక రోడ్డు ను ఏర్పాటు చేసి, వర్షాలు తగ్గిన వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని గ్రామ ప్రజల తరపున జనసేన పార్టీ నాయకులు శ్రీ కోలాటం హరికృష్ణ ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను డిమాండ్ చేశారు.