మొదటి రోజు “మన జనసేన – మన కుటుంబం” కార్యక్రమంను ప్రారంభించిన భీమిలి ఇంచార్జ్ సందీప్ పంచకర్ల
ఈరోజు “మన జనసేన – మన కుటుంబం” కార్యక్రమం మొదటిరోజు 7వ వార్డ్ పరిధి వాంబే కొలనిలో జనసేన పార్టీ భీమిలి ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల గారు నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా స్థానిక కుటుంబాలను, చిరు వ్యాపారులను కలుసుకోవడం జరిగింది. వారికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరించారు. జనసేన పార్టీ తరుపున తోడుగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతీ కుటుంబానికి జనసేన పార్టీ స్థాపనకు గల కారణాలు, సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తెలిపి స్థానిక నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేసి వాళ్ళని బలపరిచే కార్యక్రమమే “మన జనసేన- మన కుటుంబం”. ఇందులో భాగంగా డా సందీప్ పంచకర్ల గారు మరియు భీమిలి నియోజకవర్గ నాయకులు ప్రతీ వార్డు, మండలాల్లో కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వారికి వివరిస్తారు.