Logo
Date of Publish : 09 September 2022, 3:34 pm
Editor : Sake Naresh

ఆధునీకరణ పేరుతో మూత పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారం మూత

         విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లాలో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో దీనిపై ఆధారపడిన 20 వేల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందని స్థానికులు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ, జనసైనికులు  ఆరోపిస్తున్నారు. ఆదుకుంటారా.. అమ్మేస్తారా! అని ప్రభుత్వాన్ని నిలదీశారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ భవితవ్యం ఆధునీకరించి వచ్చే సీజనుకు పూర్తి సేవలు అందిస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు కొరవడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక  చెరకు రైతులకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. వచ్చే సీజన్ నాటికి ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, చెరుకు రైతులకు నమ్మకం కలగడం లేదు. రానున్న సీజన్ లో చెరకు పంటను పండించాలా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కనీస మద్ధతు ధర కరువవుతున్న  పరిస్థితుల్లో  అర్థంతరంగా ఫ్యాక్టరీని కూడా మూసివేయడంతో  చెరకు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com