
పలమనేరు, (జనస్వరం) : పలమనేరు నియోజకవర్గం గబ్బిలకోటూరు గ్రామంలో వికలాంగులైన వీరమ్మ, శంకరయ్య, లక్ష్మీనారాయణల పెన్షన్ తీసేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ స్టేట్ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ భవానీ రవికుమార్ బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి మీకు అండగా జనసేనపార్టీ ఉంటుంది అని తెలిపారు. అలాగే పలమనేరు జనసేనపార్టీ నాయకులు సుబ్రమణ్యం ద్వారా వికలాంగులకు కుటుంబాలకు భవానీ 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.