అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిధ్యాల గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి గత ఏడాది జూలై నెలలో రోడ్డు ప్రమాదం లో తన కుడి కాలును కోల్పోయాడు. వైద్య ఖర్చులకు దాదాపుగా 5 లక్షల వరకు అప్పు చేశాడు. కనీసం సొంత ఇల్లు లేక రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసెలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సమయం లో గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన భవానీ రవికుమార్ గారు వారి వైద్య ఖర్చులకు, కుటుంబ పోషణకు గాను ప్రతి నెల 10వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరుపున ఎటువంటి సహాయం అందడం లేదు. ఏ అధికారి కానీ, ఏ నాయకుడు ఎవరూ మమ్మల్ని పట్టించు కోవడం లేదు. మేము ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న మాకు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ గారు ఆపద్భాందవుడుగా వచ్చి మాకు అండగా నిలిచారని బాధితుడు అనిల్ భార్య చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఈనెల వైద్య ఖర్చులకు నిమిత్తం 20,000 వేల రూపాయలను బాధితులకు ఉరవకొండ మండలం అధ్యక్షుడు చంద్ర శేఖర్, అజయ్ , అబ్దుల్ ద్వారా బాధితుడికి అందచేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com