కదిరి నియోజకవర్గ పరిధిలోని సమస్యల మీద జనసైనికులతో చర్చించిన ఇంచార్జ్ భైరవ ప్రసాద్
కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకల్ మండలం కొక్కంటి గ్రామ పంచాయితీ గీతాలవారిపల్లి కి సరైన రోడ్డు సదుపాయం లేదని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని సమస్యను జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ కు వివరిస్తున్న గ్రామస్తులు, జనసైనికులు. దీనికి స్పందిస్తూ మీ గ్రామ రోడ్డు సమస్య ను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని గ్రామస్థులకు తెలియజేయడం జరిగింది. భైరవ ప్రసాద్ గారు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తోంది అంటే మాకు ఒక పండగలా చేసుకుంటాం అని రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 640+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు.