Logo
Date of Publish : 17 October 2022, 12:28 pm
Editor : Sake Naresh

విశాఖలో అరెస్టులపై భగ్గుమన్న జనసేన వీరమహిళలు

     అమలాపురం, (జనస్వరం) : విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అమలాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అమలాపురం నల్లవంతెన వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు, దళిత నాయకులు ఇసుక పట్ల రఘుబాబు మాట్లాడుతూ జనసేనపార్టీ ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించే "జనవాణి" కార్యక్రమం కోసం విశాఖ విచ్చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క ముఖ్య నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని, వారిని వెంటనే విడుదల చేయకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ కార్యదర్శి వీర మహిళ నాగ మానస మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సమస్యలపై వినతులు ఇవ్వడానికి వెళ్లిన పార్టీ నాయకులపై జనసైనుకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేయడం అప్రజాస్వామికం అని, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, లింగోలు పండు, పడాల నానాజీ, రాష్ట్ర నాయకులు నాగ మానస, బట్టు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పప్పుల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వరరావు, పోలిశెట్టి చిన్ని, రావూరి భాస్కర రావు, డి.యస్.కుమార్, బండారు వేంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, చేట్ల మంగతాయారు, కర్రి లక్ష్మి దుర్గ, వానపల్లి దేవి, కరాటపు వాణి, డేగల వెంకన్నబాబు, సాధనాల మురళి, పిల్లా రవి, మండేల గోపి, పాలురి నారాయణ స్వామి, నల్లా వేంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, దుర్గారావు, గట్టెం వీరు, పుప్పాల పెద్ద, నిమ్మకాయల సాయి, కల్వకొలను శివ, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com