Search
Close this search box.
Search
Close this search box.

విశాఖలో అరెస్టులపై భగ్గుమన్న జనసేన వీరమహిళలు

     అమలాపురం, (జనస్వరం) : విశాఖలో జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అమలాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అమలాపురం నల్లవంతెన వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు, దళిత నాయకులు ఇసుక పట్ల రఘుబాబు మాట్లాడుతూ జనసేనపార్టీ ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించే “జనవాణి” కార్యక్రమం కోసం విశాఖ విచ్చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క ముఖ్య నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని, వారిని వెంటనే విడుదల చేయకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ కార్యదర్శి వీర మహిళ నాగ మానస మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు సమస్యలపై వినతులు ఇవ్వడానికి వెళ్లిన పార్టీ నాయకులపై జనసైనుకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేయడం అప్రజాస్వామికం అని, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, లింగోలు పండు, పడాల నానాజీ, రాష్ట్ర నాయకులు నాగ మానస, బట్టు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, పప్పుల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వరరావు, పోలిశెట్టి చిన్ని, రావూరి భాస్కర రావు, డి.యస్.కుమార్, బండారు వేంకటేశ్వరరావు, తిక్కా సరస్వతి, చేట్ల మంగతాయారు, కర్రి లక్ష్మి దుర్గ, వానపల్లి దేవి, కరాటపు వాణి, డేగల వెంకన్నబాబు, సాధనాల మురళి, పిల్లా రవి, మండేల గోపి, పాలురి నారాయణ స్వామి, నల్లా వేంకటేశ్వరరావు, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, దుర్గారావు, గట్టెం వీరు, పుప్పాల పెద్ద, నిమ్మకాయల సాయి, కల్వకొలను శివ, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way